Saturday, May 03, 2008

శింజినీ singini - 1

శ్రీకరముగ నేను చేసిన యుద్యోగ
మవల లోకరీతి అన్ని కలిపి
కూర్చుచుంటి నాదు నేర్చిన యట్టులు
ఇంజినీరు శింజినీ రవమిది

ఇసుక, రాయి సున్న మిరుపాళ్ళు నలుపాళ్ళు
ఒక్కపాలు వేయ నొనరు "హౌసు"
మదిని మమత గలువ అదియగు నొక "హోము"
ఇంజినీరు శింజినీ రవమిది

"బీము" నందువచ్చు "బెండింగ్ మొమెంటు"లు
నిలువరించు శక్తి కలుగనేమి?
నిండు బ్రతుకు నెన్ని "బెండింగ్" "మొమెంటు" లో
ఇంజినీరు శింజినీ రవమిది

ఇల్లు కట్టి చూడు ఇనకులేశ వతంస
చిన్న ఇల్లు ఒక్కటున్న దనగ
ఇల్లు ఒక్క "ఫ్లోరు" బిల్లు "స్కైస్క్రెపరౌ"
ఇంజినీరు శింజినీ రవమిది

ఒకడు మెజరుమెంటు, ఒక చెక్మెజర్మెంటు
చేసినట్టి ఇనుము చెదలు తినిన
అస్మదీయుడైన అగునురా "రైటాఫు"
ఇంజినీరు శింజినీ రవమిది