Wednesday, September 19, 2007

gaNapayyA!

ప్రణతు లొనర్తు ము గణపయ్యా!
కరుణా దృష్టిని కనవయ్యా!
తృణ పూజలకే తృప్తి నందెదవు
గణపతి కలుముల గనుల నిచ్చెదవు
మూషిక వాహన! మోదకామోదక!
దానుల బ్రోచెడి దైవదళపతీ! ప్రణ
ఓంకార సంకేతమే నీ తొండం, నీ
ఆకార ప్రాకారమే బ్రహ్మాండం
శూర్పకర్ణములు సూర్యచంద్రులే
కూర్పగ శుభములు కూర్మి వేల్పునీవే ప్రణ
ఒక్కోక సిధ్ధికి ఒక్క వేరునను
పెక్కు రూపముల పెన్నిధి నీవే!
మ్రొక్కిన వారల మొరలను దీర్చె
బొజ్జదేవరపు ఒజ్జవు నీవే! ప్రణ

0 Comments:

Post a Comment

<< Home